పుంత రోడ్డు నిర్మించాలి

UPDATED 9th SEPTEMBER 2019 MONDAY 9:00 PM

సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : స్థానిక 30వ వార్డులోని పుంత రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ ) ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ నాయకుడు డి. శ్రీను మాట్లాడుతూ గాంధీనగర్, సాయి నగర్ ఏర్పడి 30 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సాయినగర్, గాంధీనగర్, నారా అమ్మణమ్మ అపార్ట్ మెంట్  ప్రజలు నిత్యం ప్రయాణిస్తున్న రాయభూపాలపట్నం పుంత రోడ్డు మురుగు నీటితో నిండిపోయి అధ్వాన్నంగా మారిందని, అలాగే పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, పాదచారులు అనేక  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ  నాయకులు బుజ్జి, జి. ప్రసాద్, కరణం శ్రీనివాస్, ఎస్. మణి, పి. శివ, కె. సతీష్, డి. రాము, బత్తుల బాలాజీ, డి. లక్ష్మణ, జి. మహేష్, తదితరులు పాల్గొన్నారు.

 

ads