హైబ్రీడ్ వంగడాలపై దృష్టి సారించండి

 * ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వీసీ విష్ణువర్ధన్ రెడ్డి

UPDATED 23rd AUGUST 2021 MONDAY 8:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) : మొక్కజొన్నలో హైబ్రీడ్ వంగడాల ఉత్పత్తిపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్‌ రెడ్డి సూచించారు. పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్న మొక్కజొన్న, రాగి పంటలను ఆయన సోమవారం క్షేత్రస్థాయి సందర్శన చేశారు. అనంతరం మాట్లాడుతూ మొక్కజొన్న సాగులో అధిక దిగుబడులను ఇచ్చే హైబ్రీడ్ వంగడాల ఉత్పత్తిని ప్రోత్సహించాలని, ఆదిశగా శాస్త్రవేత్తలు కృషి చేసి నూతన వంగడాలను రూపొందించాలన్నారు. తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా వంగడాలను తయారు చేయాలని, రైతులను సాంకేతికంగా అభివృద్ధి చేసి వారికి తగు పరిజ్ఞానాన్ని అందించాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వరి వంగడాలు దేశంలో పలు రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ జోగినాయుడు, డాక్టర్ టి. అనురాధ, డాక్టర్ ఇంజేటి సుధీర్ కుమార్, డాక్టర్ ఏ. సీతారామశర్మ, వి. సుజాత, భరత్ చంద్ర, నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us