అర్హత కలిగిన ప్రతీ రైతుకు రైతు భరోసా : సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య

రంపచోడవరం,22 మే 2020 (రెడ్ బీ న్యూస్):వ్యవసాయశాఖాధికారులు బ్యాంకర్ల సమన్వయంతో అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా పధకం క్రింద లబ్దిని చేకూర్చాలని సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. బ్యాంకర్లు,వ్యవసాయ శాఖాధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతు భరోసా నిధులు ఆన్ లైన్ లో జమకు సంబందించిన సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగు సమయంలో పెట్టుబడికి అప్పులుచేసి, ఆశించిన మేర దిగుబడులు రాక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు నష్టపోతున్నారని అటువంటి సంక్షోభం నుంచి రైతులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలు చేయబడుతున్నట్లు చెప్పారు. ఐటీడీఏ పరిధిలో ఇప్పటివరకు 77 శాతం మేర మాత్రమే రైతు భరోసా నిధులు రైతుల బ్యాంకుల ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. మిగిలిన రైతులకు ఎందుకు నిధులు జమకాబడలేదని అధికారులను బ్యాంకర్లను ప్రశ్నించారు.బ్యాంకు ఖాతాలు మనుగడలో లేకపోవడం, ఆధార్ బయోమెట్రిక్, వేలిముద్రలు సక్రమంగా పడకపోవడం, ఆధార్ సీడింగ్ కాకపోవడం,సెల్ నెంబర్లు మార్పులవల్ల ఓటీపీ లు రాక, ఒకే రైతుకు లోన్ ఖాతా, సేవింగ్సు ఖాతాలు ఉండటం,ఇకెవైసిలు అప్డేట్ కాకపోవడంతో నిధులు మంజూరు కాబడినప్పటికీ ఆయా ఖాతాలలో నిధులు జమకాలేదని జవాబు ఇచ్చారు. మండల వ్యవసాయాధికారులు, గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు సహకారంతో మొత్తం డివిజన్ పరిధిలోని రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించి అవి మనుగడలో ఉన్నవీ లేనిదీ పరిశీలించి మనుగడలో లేని ఖాతాదారులకు ఏయే రకాల సమస్యలున్నాయో వాటి పరిష్కారానికి గ్రామ వలంటీర్లుకు లక్ష్యాలు నిర్దేశించి సమయపాలన పట్టికను రూపొందించి బ్యాంకుల వద్ద బ్యాంకర్ల ద్వారా ఖాతాదారుల సహకారంతో ఆయా సమస్యలకు పరిష్కారాలు చూపి ఆయా ఖాతాలు పునరుద్దరించేయాలన్నారు. అలాగే అవి మనుగడలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన రైతులకు వారంలో నిధులు జమ చేయాలని ఆదేశించారు. ఒకే దఫాగా కార్యాచరణ ప్రకారం డ్రైవ్ మోడ్ లో ఈప్రక్రియ చేపట్టి అర్హులందరికి న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. అన్నదాతలు వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ ద్వారా అందుతున్న పంట పెట్టుబడి సహాయాన్ని సాగు చేసే పంటకు అవసరమైన ఉత్పాదకాలను సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. బ్యాంకు ఖాతాకు పెట్టుబడి నిధులు జమ కాని వారు దిగులు చెందాల్సిన అవసరం లేదని సాయం అందనివారికి తమ తమ బ్యాంకు ఖాతాలు పునరుద్ధరించి మనుగడలోనికి తెచ్చి ఆయా నిధులు జమ చేయడం జరుగుతుందన్నారు.ఈ ప్రక్రియలో మండల వ్యవసాయ శాఖాధికారులు కీలక భాద్యత వహించాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఇరువురు ఈ ప్రక్రియను ఆద్యంతం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు ఎస్.శ్యామల, ఎన్. దైవకుమార్ పలు బ్రాంచ్ లకు చెందిన బ్యాంకు మేనేజర్లు,పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us