బంద్ ప్రశాంతం

UPDATED 10TH SEPTEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: దేశంలో పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా సోమవారం నిర్వహించిన బంద్‌ నిర్వహించారు. స్థానిక స్టేషన్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి విద్య, వ్యాపార సముదాయాలను మూయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని, పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తక్షణమే తీసుకురావాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు జీజేపీ పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గిస్తామని చెప్పి నేడు విపరీతంగా పెంచాయన్నారు. ఫలితంగా పప్పు, ఉప్పు, నూనె వంటి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు మోటారు సైకిల్‌పై వెళ్లే పరిస్థితి లేదని, బస్సు, రైలు ఎక్కితే ఒకటికి రెండు రెట్లు ధరలు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, గుమ్మళ్ళ రామకృష్ణ, గొల్తి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ads