సహకార సంఘాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 3rd SEPTEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను బలోపేతం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని  ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మండలంలోని వి.కె. రాయపురంలో రూ.23 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం భవనాన్ని మంత్రి సోమవారం ప్రారంబించారు. ఈ సందర్బంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ సొసైటీల ద్వారా రైతులకు అన్ని విధాల సహకారం అందించడానికి ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్నభవనాల స్థానంలో నూతన భవనాలను నిర్మించి  బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. సోసైటీ పాలకమండలి పారదర్శకంగా పనిచేస్తే సొసైటీలు అభివృద్ధిలోకి వస్తాయని అన్నారు. గతంలో కన్నా ఇప్పుడు సొసైటీల్లో వ్యవసాయ పనిముట్లు, పశుగ్రాసం, ఎరువులు, మార్క్ ఫెడ్, తదితర అమ్మకాలను ఏర్పాటు చేశారని, రైతులు నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కూడ సేకరిస్తున్నట్లు చెప్పారు. రైతులకు పంట రుణాలను మంజూరులో సొసైటీలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి డాక్టర్ డి. పాండురంగారావు, ఎంపిపి ఆకునూరి సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ ఊటా శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల శ్రీహరి, తహసీల్దార్ ఎల్. శివకుమార్, గుమ్మళ్ల రామకృష్ణ, అడబాల సర్వారాయుడు, మర్రి నారాయణస్వామి, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, సొసైటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
ads