మరిడమ్మ దేవస్థానంలో ఈ టిక్కెట్ కౌంటర్ ప్రారంభం

UPDATED 30th OCTOBER 2017 M0NDAY 8:00 PM

పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో గల మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ-టిక్కెట్ కౌంటర్ ను ఆలయ చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ సోమవారం ప్రారంభించారు. దేవాదాయశాఖ అదేశాల మేరకు అమ్మవారి ఆలయంలో అన్ని సేవా టిక్కెట్లును ఆన్ లైన్ లో విక్రయించే విధానం ద్వారా భక్తులుకు మరిన్ని మెరుగైన సేవలను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.పుష్పనాథం మాట్లాడుతూ ఈ విధానం ద్వారా భక్తులకు అన్ని సేవలు సక్రమంగా అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు తమ్మన మైనర్ బాబు, కొంగర సత్యనారాయణ, కోటాని గణేష్, గోమాడ అర్జునరావు, గోలి శ్రీరాములు, ఆకుల వీర వెంకట మురళీకృష్ణ, కొప్పర్తి కృష్ణ, యిజ్జిన కృష్ణవేణి, రాయ విజయకుమార్ మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ads