వెలుగుబందలో గైట్ విద్యార్థుల స్వచ్ఛభారత్

UPDATED 28th FEBRUARY 2018 WEDNESDAY 8:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ( గైట్) కళాశాల ఎంసిఎ విద్యార్థులు వెలుగుబంద గ్రామంలో ఎంపీయూపి పాఠశాల విద్యార్థులకు బుధవారం చైతన్య కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా పౌష్టికాహారం, వాన నీటి సంరక్షణ, స్వచ్ఛభారత్, ఇంటర్ నెట్ వినియోగం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల ఎంసిఎ విభాగాధిపతి  ఆర్. తమిళ్ కోడి మాట్లాడుతూ సామాజిక అంశాలపై తమ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గ్రామాలలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామాజిక అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని, దీనిలో భాగంగా తమ కళాశాల విద్యార్థులు ఇటువంటి స్ఫూర్తివంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసిఎ ఫాకల్టీ సభ్యులు ఆర్. బాల దినకర్, టి.ఎం శిరీష, ఎంసిఎ విద్యార్థులు పాల్గొన్నారు. 

ads