భీమేశ్వరాలయ హుండీ ఆదాయం లెక్కింపు

UPDATED 21st FEBRUARY 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట :తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో బుధవారం హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు లెక్కించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల ద్వారా సమకూరిన ఆదాయం రూ.6,36,024 లభించగా, కానుకలు, ముడుపుల ద్వారా రూ.7,67,680 లు, ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల ద్వారా రూ.50,740 లు, మొత్తంగా రూ.14,27,304 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యానిర్వాహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు. గత సంవత్సరం కంటే అధికంగా ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఎండోమెంట్ ఇనస్పెక్టర్ పివిఎస్ మూర్తి, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు పడాల సూర్యనారాయణ, దూది రాజు, తదితరులు పాల్గొన్నారు.

ads