చంద్రన్న పెళ్లి కానుక చెక్కు అందచేత

UPDATED 26th APRIL 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక బళ్ల మార్కెట్ సెంటర్ లో జరిగిన వేమగిరి ప్రసాద్, అనితల వివాహానికి విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వధూవరులను ఆశీర్వదించి చంద్రన్న పెళ్లికానుక చెక్కును గురువారం వారికి అందించారు. అలాగే మసీదు సెంటర్లో జరిగిన అభిముల్లా వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకల్లో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, కంటే బాబు, గుమ్మళ్ల రామకృష్ణ, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

ads