కరోనా సోకిన గర్భిణీ స్త్రీలను వెంటనే జాయిన్ చేసుకోవాలి

* జిల్లా జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) రాజకుమారి

UPDATED 6th AUGUST 2020 THURSDAY 6:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): కరోనా వైరస్ సోకిన గర్భిణీ స్త్రీలను మొదటి ప్రాధాన్యతగా భావించి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే జాయిన్ చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో గల కోవిడ్ వార్డులను జెసీ రాజకుమారి, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్ తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్ బోర్డులు అందరికీ కనిపించేలా బోర్డుల పరిమాణం పెంచాలని జేసీ ఆదేశించారు. అనంతరం కోవిడ్ వార్డుల వద్ద జరుగుతున్న ఓపీ ప్రక్రియ పరిశీలించి అక్కడ ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో జేసీ  వెంట సిపిఓ కెవికె రత్నబాబు, డాక్టర్ బి. సత్యసుశీల, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads