UPDATED 23rd JANUARY 2018 TUESDAY 9:00 PM
షిర్డి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం షిర్డి లోని శ్రీసాయిబాబాను దర్శించారు. ఉదయం జరిగే కాకడహారతి కార్యక్రమంలో చినరాజప్ప కుటుంబ సభ్యులు పాల్లొన్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన చినరాజప్పకు శ్రీ షిర్డిసాయిబాబా సంస్ధాన్ అధికారులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి తీర్ధప్రసాదాలను అందజేశారు. అనంతరం తనను కలసిన విలేకరులతో మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు సాయిబాబా వారి ఆశ్శీసులు కోసం ప్రార్ధించామని చినరాజప్ప తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్ధికలోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా పయనింపజేసి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మరింత శక్తిని ప్రసాదించమని సాయిబాబాను వేడుకున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి చాలా బాగుందన్నారు. గతంతో పోలీస్తే నేరాల సంఖ్య తగ్గిందని చినరాజప్ప తెలిపారు. 2018ను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పోలీసుశాఖ పనిచేస్తోందన్నారు.