పెద్దాపురం, 31 అక్టోబరు 2020(రెడ్ బీ న్యూస్): మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో చంఢీహో
మాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా
అమ్మవారికి 700 శ్లోకాలతో వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండి
తులు పర్యవేక్షణలో అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, పూజలు చేశారు.
ప్రజలకు సకల శుభాలు, కార్యాలు నెరవేర్చేందుకు ఈ ఛంఢీహోమం నిర్వహించడం
జరుగుతుందని పండితులు పేర్కొన్నారు. చంఢీహోమం అనంతరం కుంకుమ పూజలు, అమ్మవారికి పుష్పపూజలు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదాలను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మీ, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.