నినాదాల పోటీల్లో మున్సిపల్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

UPDATED 5th MARCH 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: 47వ రక్షణ దినోత్సవ సంబరాల్లో భాగంగా విద్యార్థులకు పరిశ్రమల శాఖ నిర్వహించిన నినాదాల పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు ద్వితీయ, తృతీయ, స్థానాలు పొందినట్లు బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. తమ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు బి.సంతోష్, దుర్గా గణేష్ నినాదాల పోటీలో చక్కని ప్రతిభ కనభరిచి వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల అసెంబ్లీలో ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. కాకినాడలో మంత్రి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా వారు బహుమతులు, ధృవపత్రాలను పొందారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.అరుణ, కె.వి.వి. సత్యనారాయణ, ఎం.ఎల్.వి. కుమారి, పి.ఐ.టి ఎం.వెంకటేశ్వర్లు, తదితరులు అభినందించారు.

ads