ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ లో ముగిసిన అధ్యాపక అభివృద్ధి శిక్షణ

UPDATED 1st JUNE 2018 FRIDAY 6:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మానవ వనరుల విభాగంలో అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం శుక్రవారంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (అనంతపురం)కు చెందిన డాక్టర్ పి. మురళీకృష్ణ  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు నిరంతరం విద్యార్థుల్లా ఆధునిక బోధనా పద్ధతులు, ప్రతీ అంశంపై అవగాహన పెంపొందించుకుని బోధించడం ద్వారా ఉత్తమ అధ్యాపకులుగా  విజేతలుగా అవతరించవచ్చు అని సూచించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ వెలుగుతున్న దీపమే మరికొన్ని దీపాలను వెలిగించగలదు అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలను ఉత్తమ అధ్యాపకులు నిరంతరం ఆచరణ ద్వారా చూపుతారని అన్నారు. విద్యార్థికి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువు చెప్పాలని, నవ సమాజ నిర్మాణంలో అధ్యాపకుల పాత్ర కీలకమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు.
ads