గిరిజన ప్రాంతాల్లో పర్యటించిన కోవిడ్ - 19 ప్రత్యేకాధికారి

రంపచోడవరం,21 మే 2020(రెడ్ బీ న్యూస్):రాష్ట్ర గిరిజన,సాంఘిక సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా కోవిడ్-19 నియంత్రణ ప్రత్యేకాధికారి కాంతిలాల్ దండే గిరిజన ప్రాంతాలలో గురువారం పర్యటించారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలను సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇంచార్జ్ పివో ప్రవీణ్ ఆదిత్యను అడిగి తెలుసుకున్నారు. గిరిజనాభివృద్ధికి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు ఐటీడీఏ పివో ప్రవీణ్ ఆదిత్య ముఖ్య కార్యదర్శికి వివరించారు. అదేవిధంగా ప్రభుత్వాలు గిరిజనులు అభివృద్ధికి సంక్షేమానికి ప్రవేశ పెట్టిన పథకాల నిర్వహణ, వాటి అమలులో పురోగతిని సమీక్షించారు. గిరిజన ప్రాంత భౌగోళిక స్థితిగతులు, గిరిజన జాతులు, వారికోసం ప్రత్యేకించి అమలు చేస్తున్న పథకాలను ఆయన పీవోను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న నాడు-నేడు, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు, అమ్మఒడి, కార్యక్రమాలు అమలు, గ్రామ సచివాలయాల నిర్వహణ తీరును ముఖ్య కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. గిరిజన జనాభా, మండలాలు, గ్రామాలలో నివసిస్తున్న గిరిజన జాతులు, తెగలు వివరాలను ఆయన ఆడిగి తెలుసుకున్నారు. గిరిజనాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు ద్వారా పారదర్శకతతో పనిచేసి గిరిజనులు మేలు చేకూర్చాలన్నారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ పి.రమాదేవి, డీడీ ఎం.సరస్వతి, ఎవో డిఎన్ఏ రమణ తదితరులు పాల్గొన్నారు.
ads