జటాయువు ఆలయంలో వైభవంగా సీతారాముల కల్యాణం

UPDATED 21st FEBRUARY 2018 WEDNESDAY 10:00 PM

ఎటపాక: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక జటాయువు ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం భద్రాద్రి రామాలయం నుంచి శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులను శాస్త్రోక్తంగా ఊరేగించి జటాయువు మండపానికి తీసుకుని వచ్చారు. తొలుత జటాయువుకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆర్చకులు సీతారాముల కల్యాణం నిర్వహించారు. ప్రతీ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ షష్ఠి సందర్భంగా ఈ కల్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ప్రభాకర శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.
ads