గైట్ పాలిటెక్నిక్ కళాశాల తరగతులు ప్రారంభం

UPDATED 18th JUNE 2018 MONDAY 10:00 PM

రాజానగరం: గైట్ పాలిటెక్నిక్ కళాశాల మొదటి సంవత్సరం తరగతులు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. గోవర్ధన రామానుజం అధ్యక్షతన విద్యార్థులు, తల్లిదండ్రులతో కళాశాలలో నిర్వహించిన సమావేశానికి బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వి. నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు విలువలతో కూడిన నైపుణ్యాలు పెంపొందించుకుంటే రాణించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, పాలిటెక్నిక్ కోర్సు పూర్తయిన అనంతరం ఉద్యోగాలు పొంది కుటుంబానికి అండగా నిలవాలన్నారు. క్రమశిక్షణతో ప్రణాళిక మేరకు విద్య పట్ల ఆసక్తి పెంచుకొని లక్ష్యాలను చేరుకోవాలని, ఆ కృతనిశ్చయంతో ప్రతీ విద్యార్థి కృషి చేయాలన్నారు. చైతన్య విద్యా సంస్థల సిఈవో డాక్టర్ డి.ఎల్.ఎన్. రాజు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంజినీరింగ్ విద్యార్థులతో సమానంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోవర్ధన రామానుజం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కళాశాలకు తమ పిల్లలను క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడవలసిన గురుతర బాధ్యత తల్లిదండ్రుపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వి. పద్మజ, తల్లిదండ్రులు, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.     

ads