టెన్నిస్ క్రీడా కేంద్రంగా పెద్దాపురం తయారుకావాలి

* పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప
* జాతీయస్థాయి  సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ఛాంపియన్ ప్రారంభం

UPDATED 22nd SEPTEMBER 2019 SUNDAY 10:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్):  పెద్దాపురం పట్టణం భవిష్యత్తులో ప్రఖ్యాత టెన్నిస్ క్రీడా కేంద్రంగా తయారుకావాలని ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక లిటరరీ అసోసియేషన్ టౌన్ హాలులో నిర్వహిస్తున్న మహారాజా కప్- గిస్తా 2019 జాతీయ స్థాయి సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా టౌన్ హాల్ ప్రెసిడెంట్ రాజా సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన సభలో ఎంఎల్ఏ చినరాజప్ప మాట్లాడుతూ పెద్దాపురం టౌన్ హాలు బ్రిటీష్ కాలం నాటిదని, ఈ టౌన్ హాలు టెన్నిస్ క్లబ్ ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిందని అన్నారు. అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి, ఆయన తండ్రి ఈ క్రీడా ప్రాంగణంలో టెన్నిస్ ఆడారని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వపరంగా క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించడానికి మినీ స్టేడియం కూడా తయారవుతుందని, నేటి యువతకు టెన్నిస్ క్రీడపై తర్ఫీదు ఇచ్చి మంచి క్రీడాకారులుగా తయారు చేయాలని అన్నారు. టౌన్ హాల్ ప్రెసిడెంట్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ టెన్నిస్ టోర్నమెంట్ ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నామని, ఈ టోర్నమెంట్ కు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తదితర రాష్ట్రాల నుంచి 350 మంది క్రీడాకారులు హాజరవుతున్నారని అన్నారు. ఈ టెన్నిస్ టోర్నమెంట్ కు విచ్చేసిన అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాడు, ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత నితిన్ కీర్తనకు  పెద్దాపురం టెన్నిస్ అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం నితిన్ కీర్తనేను టెన్నిస్ క్రీడాకారులను, టోర్నమెంట్ కు సహకరించిన దాతలను ఎమ్మెల్యే సన్మానించారు. తొలుత ఆర్&బి అతిధి గృహం నుంచి తీన్ మార్ డప్పులు, అశ్వాలతో క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గిస్తా ప్రెసిడెంట్ రెడ్డప్ప దవేజీ, సెక్రటరీ డి. రామారావు, కాకినాడ టెన్నిస్ ప్రెసిడెంట్ జి. శేషగిరిరావు, ఎఐటీఏ సెక్రటరీ పి.వి. రాంకుమార్, శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రకాష్, పెద్దాపురం టెన్నిస్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ పసల పద్మరాఘవరావు, సెక్రటరీ ఎమ్.ఎస్. ప్రకాష్, టౌన్ హాల్ సెక్రటరీ జె. రమేష్, తదితరులు పాల్గొన్నారు.

  
 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us