కార్తీక మాసం...గోదావరి స్నానం పరమపవిత్రం

UPDATED 30th OCTOBER 2017 MONDAY 9:00 PM

రాజమహేంద్రవరం : కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరిస్తే పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం కోటిలింగాల, సరస్వతి, మార్కండేయ, వీఐపీ ఘాట్ల సహా గోదావరి తీరంలోని కోటిపల్లి తదితర ఘాట్లన్నీ తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. అధిక సంఖ్యలో మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి అరటిడొప్పల్లో దీపాలు వెలిగించి గోదావరిలో వదిలి భక్తితో నమస్కరించారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన ద్రాక్షారామ, సామర్లకోటలోని భీమేశ్వరాలయాలు, మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం సహా అన్ని ప్రముఖ దేవాలయాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగాయి..భక్తులు పంచామృతాభిషేకాలు, లఘున్యాస అభిషేకాలు, రుద్రాభిషేకాలు, లక్ష కుంకుమ పూజలు, లక్షపత్రి పూజలు చేశారు. 
ads