ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు

* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
* పెద్దాపురం వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్ మేళా

UPDATED 29th FEBRUARY 2020 SATURDAY 6:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి పంటలను సాగుచేస్తే అధిక దిగుబడులు పొందవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. పెద్దాపురం ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కిసాన్ మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మంత్రి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ భారతదేశంలో 67 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగంలో లాభాలు రావాలంటే శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు తప్పక పాటించాలని అన్నారు. మన పూర్వీకులు చేపట్టిన సాగు విధానాలు కాకుండా ఎరువులు, పురుగు మందులు, నాణ్యమైన విత్తనాలతో పాటు నూతన పరికరాలు, పనిముట్లు వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా రూ.13500 ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటుందని తెలిపారు. నేషనల్ రిమోట్ సెంటర్ ద్వారా ధరల స్థిరీకరణ నాట్లు వేసిన మొదటి రోజునే ప్రకటించాలని, ధరల స్థిరీకరణ మన రాష్ట్రంలో ఈ సంవత్సరం ఏర్పాటుకు చర్యలు చేపట్టి రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు  చర్యలు చేపడతామని అన్నారు. డైరీకి పాలు సరఫరా చేసే వారికి లీటరుకు నాలుగు రూపాయలు బోనస్ ఇవ్వడానికి చర్యలు చేపడతామని. నూతన సాంకేతిక విధానాల ద్వారా రైతు పంటలు మారుస్తూ సాగుచేస్తే ఆదాయం పెరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర  వ్యవసాయ, సహకార శాఖా  మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ మన రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 45.50 లక్షల కుటుంబాలకు రైతు భరోసా పధకంలో భాగంగా రూ.13500  అందజేస్తున్నారని, ఉచిత పంటల భీమా, వడ్డీ లేని రుణాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయడంతో పాటు క్వాలిటీ ఇన్ ఫుట్, అవుట్ పుట్ ద్వారా రైతులకు ఆదాయం పెరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నష్టాలతో సాగు చేయలేక నిరాశతో చనిపోయిన రైతులు 1600 కేసులు ఉంటే  విచారణ జరిపి 417 మందికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని నేడు జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్లు, సంబంధిత అధికారులు అందజేయడం జరిగిందన్నారు. వచ్చే రెండేళ్లలో మన జిల్లాలో పరిశోధన ద్వారా హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనాలు పండించడానికి పెద్దాపురం పరిశోధనా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. ఉద్యాన పంటలు అధిక దిగుబడి సాధించడానికి, వ్యాపార పంటలు అభివృద్ధి చేయడానికి పరిశోధనా కేంద్రాల్లో చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఉద్యానవన పంటలు విస్తీర్ణం పెంచడానికి, కొబ్బరిలో చీడపీడలు తగ్గించడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. గృహానిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలు వరి పంట సాగులో అగ్రగామిగా ఉన్నాయని, అలాగే వరితో పాటు చెరకు, కర్ర పెండలం, మొక్కజొన్న, చిరు ధాన్యాలలను కూడా రైతులు సాగు చేయాలని అన్నారు. వాతావరణ కాలుష్యం వల్ల మన జిల్లాలో ఉద్యానవన పంటలకు తెల్లదోమ ముప్పు ఉందని, వీటిపై రైతులు, శాస్త్రవేత్తలు సామూహికంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ పరిశ్రమలు నడవాలంటే వ్యవసాయ పంటలు ముఖ్యమని, రైతాంగానికి ఆర్థిక చేయూతనిచ్చి తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అధిక ఉత్పత్తి సాధించేందుకు పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సహకరించాలని ఆమె తెలిపారు. ఎంఎల్ఏ నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రైతులకు పంట ఉత్పత్తులు పెరిగేలా శాస్త్ర విజ్ఞానం వినియోగించుకొని వ్యవసాయం చేసేలా పరిశోధనా కేంద్రాలు ఉపయోగపడాలని అన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తొలుత కేంద్రంలో పండిస్తున్న అపరాలు మొక్కజొన్న, రాగులు, కొర్రలు, తదితర పంటలను పరిశీలించారు. అలాగే వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేసిన స్టాల్స్, పోస్టర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం డైరెక్టర్ ఎ.ఎస్.రావు, రీసెర్చ్ సెంటర్ అసోసియేట్ డైరెక్టర్ పి.వి. సత్యనారాయణరావు, ఆచార్య ఎన్జీ  రంగా పాలక మండలి సభ్యులు నేతాజీ, శాస్త్రవేత్త డాక్టర్ ఐ. సుధీర్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి  కె.ఎస్.వి. ప్రసాద్, ఎడిఎ ఎం. రత్నప్రశాంతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.

 

  

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us