గైట్ డిగ్రీ కళాశాలో ఫోరెన్సిక్ ఓడోన్ టాలజిపై సెమినార్

UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 5:30 PM

రాజానగరం: గైట్ డిగ్రీ కళాశాల ఫోరెన్సిక్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో  ఫోరెన్సిక్ ఓడోన్ టాలజీ అనే అంశంపై శనివారం సెమినార్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లీమాధవి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ చైర్మన్ ఎ. ఆదిత్ మాట్లాడుతూ ఫోరెన్సిక్ వివిధ రంగాల్లో వినియోగిస్తున్నారని, సివిల్ నిర్మాణాలు కూలిపోయినపుడు హత్య కేసులు, వివిధ రకాల ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో కేసుల పరిశోధనల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. సైబర్ సెక్యూరిటీ, సైబర్ త్రెడ్స్ గురించి తెలిపారు. ఓడోన్ టాలజీలో ఫోరెన్సిక్ నిపుణులు తాళ్ళూరి భవ్య నిత్యజీవితంలో ఫోరెన్సిక్ సైన్స్ అప్లికేషన్స్ గురించి వివరించారు. దంత వైద్య శాస్త్రం ఫోరెన్సిక్ పరిశోధనల్లో పళ్ళ వరుసల కూర్పు, పళ్ళగాట్లును ఎలా పరిశోధన చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫోరెన్సిక్ విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.        

 

ads