భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని

UPDATED 27th FEBRUARY 2020 THURSDAY 8:00 PM

కరప(రెడ్ బీ న్యూస్): ఉగాది నాటికి ఇళ్ళ పట్టాలు పంపిణీకి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను  వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. ఇళ్ళ పట్టాలు పంపిణీకి సంబంధించిన భూములు, లేఅవుట్లను పరిశీలించేందుకు ఆమె గురువారం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా కరప మండలం అరట్లకట్ట గ్రామంలో 6.8 ఎకరాల విస్తీర్ణంలో 311 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన లేఅవుట్లు ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న స్థలాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వారికి కేటాయించిన స్థలాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయని లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడ వున్న వాలంటీర్లతో మాట్లాడుతూ వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుండి బయలుదేరి గురజానాపల్లి వద్దనున్న సాల్ట్ భూములు, కాకినాడ పోర్టు ల్యాండ్ లో లబ్ధిదారులకు కేటాయించనున్న ఇళ్ల స్థలాల భూములను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పోర్టు భూముల్లో లబ్ధిదారులకు చేస్తున్న లేఅవుట్ పనులను ఆమెకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సామ్యూల్, జిల్లా  జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, కాకినాడ ఆర్డీవో ఎ.జి. చిన్నికృష్ణ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us