సాగునీటిని పూర్తిస్థాయిలో అందించాలి

UPDATED 29th JUNE 2020 MONDAY 9:00 PM

జగ్గంపేట(రెడ్ బీ న్యూస్): పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఇరిగేషన్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ ఏఈ జగదీష్ కు వినతిపత్రం సోమవారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని కాలువల్లో జంగిల్ క్లియరెన్సు చేసి ఆయకట్టు చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగేలా చూడాలని, చెరువుల్లో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి పుష్కర మెయిన్ ఫేజ్ వన్, ఫేజ్-2 పంపు హౌస్ లో నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమలో రైతులు కోడి శ్రీనివాస్, బోనం వెంకటేశ్వర్లు, చెన్నంశెట్టి చక్రరావు, ప్రసాద్, పురుషోత్తమరావు, రాజా, వీరన్న, వెంకట్రావు, గోవిందు, నాగేశ్వరరావు, సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.

ads