శివ నామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

UPDATED 13th FEBRUARY 2018 TUESDAY 6:30 PM

సామర్లకోట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున బారులు తీరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎం.ఎల్.సి బొడ్డు భాస్కర రామారావు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే  ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు పడాల వీరబాబు, బాడితమాని త్రిమూర్తులు, అడబాల కుమారస్వామి, కుర్రా నారాయణస్వామి, పాలకుర్తి శ్రీనుబాబు, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ళ లక్ష్మీనారాయణ, కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు, అడిషనల్ ఎస్పీ దామోదర్, ఓఎస్డీ రవిశంకర్, ఎంపిడివోలు, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, ఎస్ఐ ఎల్. శ్రీనివాసనాయక్, అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 
ads