రికార్డు స్థాయిలో శ్రీవారి ఆదాయం

UPDATED 25th DECEMBER 2020 FRIDAY 8:00 PM

తిరుమల (రెడ్ బీ న్యూస్): అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధిలో ఇవాళ రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.3 కోట్లు వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ తర్వాత  అత్యధిక ఆదాయం ఇదే ప్రథమమని అన్నారు. ఈనెలలో ఇప్పటికే ఐదుసార్లు రూ.3 కోట్లు హుండీ ఆదాయం దాటింది. లాక్‌డౌన్ తర్వాత ఇవాళ రికార్డు స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగారు. కోవిడ్ ‌టెస్ట్‌లు చేసుకుని నెగిటివ్‌ వచ్చిన 200 మంది మహిళా ఉద్యోగులు రథాన్ని లాగారు. తొలుత స్థానికులకే శ్రీవారి సర్వదర్శన టోకెన్లు ఇస్తామన్నారు. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు ‘స్థానికత’ను పరిమితం చేశారు. చివరకు క్యూలో వచ్చిన వారందరికీ వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్లను నగరంలోని ఐదు కౌంటర్లలో ఇచ్చారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us