ఆదిత్యలో ఘనంగా ప్రారంభమైన ఇంటర్ కాలేజ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్

UPDATED 2nd MARCH 2018 FRIDAY 6:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో నేటి నుంచి మూడురోజుల పాటు జరగనున్న జె.ఎన్.టి.యు.కె. మహిళల ఇంటర్ కాలేజ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం  ఘనంగా ప్రారంభమైనట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, జె.ఎన్.టి.యు.కె. రిజిస్ట్రార్ డాక్టర్ వి.వి.సుబ్బారావు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ అబ్బయ్య, మహిళా సాధికార సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ స్వర్ణకుమారి, ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.పి.రాజు, జి.శ్యాంకుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ నటుడు సుమన్ పాల్గొని గేమ్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని, క్రీడల వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరిగి జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటారని అన్నారు. సంస్థ చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే తమ విలువైన జీవితాలను క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మీలో ఉన్న ప్రతిభను చూపేందుకు ఇటువంటి వేదికలను క్రేడాకారులు ఉపయోగించుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు చెందిన 56 కళాశాలల నుంచి సుమారు 16 వందల మంది క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీలలో భాగంగా బాస్కెట్ బాల్, షటిల్, ఖో-ఖో, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, త్రో బాల్, వాలీ బాల్, చెస్, తదితర అంశాలలో విద్యార్థులు తమ ప్రతిభ కనబరచనున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి , ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, బి.పి.డి. కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజీ, మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సి.హెచ్. మురళీ మోహన్, వివిధ కళాశాలల వ్యాయమ అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.    

ads