మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు

UPDATED 11th FEBRUARY 2018 SUNDAY 8:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలకు భారీ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం శాశ్వతంగా ఉండేలా కొత్తగా వంతెన ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు ఆలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయానికి రంగురంగుల విద్యుత్ దీపకాంతులు ఏర్పాటు చేశారు.

ads