భక్తి శ్రద్ధలతో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట

UPDATED 21st NOVEMBE 2019 THURSDAY 8:30 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): స్థానిక కోట్లమ్మ చెరువు కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో గురువారం ప్రతిష్టించారు. సుమారు రూ.50 వేలు వ్యయంతో రూపొందించిన ఏడు అడుగుల ఎత్తుగల స్వామివారి విగ్రహానికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు క్షత్రి సీతారాం సింగ్, రాజారాం సింగ్, మాతా సింగ్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు సుంకవిల్లి బాపిరాజు, మాజీ కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి, బొండు రాజు, పబ్బు వేణుగోపాల్, ప్రముఖ ఎలక్ట్రికల్ వర్క్స్ అధినేత ఉయ్యురు అప్పలరాజు దంపతులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

 

ads