నర్సింగ్ రంగంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు అమూల్యం

UPDATED 2nd JANUARY 2020 THURSDAY 8:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): నర్సింగ్ రంగంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలు అమూల్యమైనవని జిల్లా కలక్టర్ డి. మురళీధరరెడ్డి కొనియాడారు. స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్, యుఎన్ఓలు ఫ్లారెన్స్ నైటింగేల్ సేవలను గుర్తించి 2020వ సంవత్సరాన్ని అంతర్జాతీయ నర్స్, మిడ్ వైఫ్ సంవత్సరంగా ప్రకటించారని, అలాగే ఈ సంవత్సరానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ 2030 సంవత్సరం నాటికి అందరికి ఆరోగ్యం అనే నినాదం ఇవ్వడం జరిగిందన్నారు. నేటి కాలంలో వైద్యులతో పాటు నర్సింగ్ సేవలు అందించేవారు చాలా అవసరమన్నారు. ప్రపంచవ్యాప్తంగా 18 మిలియన్ల నర్సింగ్ సేవలు అవసరం కాగా, ప్రస్తుతం తొమ్మిది మిలియన్ల నర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. చాలా దేశాలలో ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు మరణించే వయస్సు 57 నుంచి 64 సంవత్సరాలు పెరగడంతో వృద్ధులు సంఖ్య అధికంగా ఉన్న కారణంగా నర్సుల సేవలు మరింత అవసరం కానున్నాయని తెలిపారు. నర్సింగ్ వృత్తిలో ఉన్న వారు, ఈ వృత్తిలోకి క్రొత్తగా ప్రవేశించేవారు సేవ చేయాలనే దృక్పధంతో, రోగులకు, వృద్ధులకు అంకితభావంతో సేవలు అందించాలన్నారు. ప్రతీ ఒక్కరూ నర్సుల సేవలను గుర్తించి వారికి సహకరించి వారికి అండగా నిలవాలని పేర్కొన్నారు. అనంతరం నర్సింగ్ సేవల ప్రాధాన్యతను తెలియజేస్తూ నర్సింగ్ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీని జిల్లా కలక్టరు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, సిఎస్ఆర్ఎమ్ఓ డాక్టర్ ఎం. పద్మ శశిధర్, డిఎస్ఆర్ఎమ్ఓ డాక్టర్ రాజేశ్వరి, బిఎస్సీ నర్సింగ్ ప్రిన్సిపాల్ సత్యవల్లి, జిఎస్ఎమ్ ప్రిన్సిపాల్ అనురాధ, నర్సింగ్ సూపరింటెండెంట్ అక్కమ్మ, నర్సింగ్ విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us