ఘనంగా మరిడమ్మ జన్మ నక్షత్ర పూజలు

UPDATED 26th JUNE 2020 FRIDAY 11:00 AM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసివున్న మరిడమ్మ దేవస్థానంలో అమ్మవారి జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని శుక్రవారం వేదపండితులు చిట్టెం హరిగోపాలశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, వేదపండితులు, తదితరులు పాల్గొన్నారు.

ads