ఉత్సాహంగా క్రీడాపోటీలు

UPDATED 14th JUNE 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: బడి పిలుస్తోంది విద్యా వారోత్సవాల్లో భాగంగా స్థానిక యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు టి. వైకుంఠం ఆధర్యంలో విద్యార్థులకు గురువారం క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాయామంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు బాల్యం నుంచి విద్యతో పాటుగా క్రీడల్లో కూడా రాణిస్తే, నూతన ఉత్సాహంతో ముందుకు వెళతారని అన్నారు. అనంతరం వ్యాయామ క్రీడా పరికరాలు, ప్రముఖ క్రీడాకారుల చిత్రాలను ప్రదర్శించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యు. సత్యనారాయణ చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. 

ads