సెల్ టవర్ ఏర్పాటును అడ్డుకున్న స్థానికులు

UPDATED 24th JULY 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక 30వ వార్డులో సెల్ టవర్ ఏర్పాటును ఆ వార్డు ప్రజలు మంగళవారం అడ్డుకున్నారు. విషయం తెలిసిన వెంటనే వార్డు కౌన్సిలర్ బడుగు శ్రీకాంత్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. నివాస ప్రాంతాల మధ్య సెల్ టవర్ ఏర్పాటును నిలిపివేయాలని, ఈ టవర్ వల్ల అనేక రోగాలు బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆయనకు విజ్ఞప్తి చేశారు. వెంటనే ఈ విషయాన్ని కౌన్సిలర్ మున్సిపల్ కమిషనరుకు ఫిర్యాదు చేశారు. కమీషనర్ సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి, సెల్ టవరుకు సంబంధించిన కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

ads