టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

తిరుమల,28 మే 2020 (రెడ్ బీ న్యూస్): తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా టీటీడీ భూములు విక్రయించొద్దని నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీ ఆస్తులు,కానుకలు విక్రయించకూడదని నిర్ణయించింది. నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతంకాకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో పాలకమండలి సభ్యులు, పీఠాధిపతులు, భక్తులకు చోటు కల్పించనుంది. టీటీడీ ఆస్తులు విక్రయిస్తున్నారన్న ప్రచారంపై విచారణ జరపాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పాలకమండలిపై మరోసారి ఆరోపణలు రాకుండా చూడాలన్నారు.తిరుమలలో అతిథి గృహాల కేటాయింపులో పారదర్శకత ఉంటుందని చెప్పారు.పాత అతిధి గృహాలు పునర్నిర్మించేందుకు మాత్రమే అనుమతి ఉందన్నారు. డోనేషన్ విధానంలో నూతన విధానాన్ని రూపొందించాలని ఆదేశించామని ఆయన తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.టీటీడీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల ఆసూపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. తిరుమలలో పాత కాటేజీల కేటాయింపుపై అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు తొలగించాక భక్తులకు శ్రీవారి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు.
ads