మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:కలెక్టర్ మురళీధర్ రెడ్డి

రాజమహేంద్రవరం, 3 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): ప్రజల భాగస్వామ్యంతో మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరంలో జడ్పీ సీఈవో ఎం. జ్యోతి ఆధ్వర్యంలో మనం - మన పరిశుభ్రత కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా మహాత్మా గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో వ్యర్ధ పదార్ధాలు నిర్వహణను సమర్థవంతంగా అమలు చేస్తూ మన రాష్ట్రం విశిష్ట గుర్తింపు పొందిందని అన్నారు. అన్ని గ్రామ పంచాయతీలను వ్యర్ధ రహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం, బొమ్మూరు గ్రామాలను పైలెట్ గ్రామాలుగా ఎంపిక చేయబడ్డాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు గ్రామం, పట్టణం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఏర్పరుచుకోవాలని అన్నారు. చెత్తపై అశ్రద్ధ చేసినట్లయితే దేశంలో చెత్త కోసం ప్రతి సంవత్సరం రెండు వేల ఎకరాలు స్థలం కావాల్సి వస్తుందని అన్నారు. ఇంటింటా చెత్తసేకరణలో భాగంగా గ్రీన్ అంబాసిడర్ల వ్యవస్థ ఏర్పాటు పాతది అయినప్పటికీ ఈ అంబాసిడర్లకు ప్రాధాన్యత ఇచ్చి తడి, పొడి చెత్త వేరు చేసి వారికి అందించాలని, అదేవిధంగా కుటుంబానికి రూ. రెండు రూపాయలు చొప్పున నెలకు రూ.60 రూపాయలు ఇవ్వడం ద్వారా గ్రీన్అంబాసిడర్, గ్రీన్ గార్డులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఈ సొమ్మును చెత్తను రవాణా చేసిన వాహనాలకు వాటి నిర్వహణకు ఉపయోగిస్తారని అన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయడం ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ద్వారా విభజించి సేంద్రియ ఎరువులు కూడా అందించే విధంగా అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ ఈకార్యక్రమానికి వెంకటనగరం ఎంపిక కావడం సంతోషకరమని గ్రామ ప్రజలు ఇటువంటి కార్యక్రమంలో సహకరిస్తారని, పరిశుభ్రత వలన కరోనావంటి వ్యాధులు బారిన పడకుండా ప్రతి ఒక్కరు పరిశుభ్రతను పాటించాని కోరారు. మాజీ సర్పంచి ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ ఈ కార్యక్రమం కోసం రూ. లక్ష 5 వేలను అందించారు. చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గ్రామ సచివాలయానికి అందజేశారు. పారిశుద్ధ్య కార్మికులకు కలెక్టర్ చేతుల మీదుగా కిట్లను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని పరిశీలించి వాలంటీర్లు సిబ్బందిని వివిధ పథకాలు పనితీరుపై ఆరా తీశారు. వ్యర్ధ పదార్థాల సేకరణ, మినీ ట్రాక్టరును కలెక్టర్ ప్రారంభించారు. రైతు సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్, డీ.ఆర్.డీ.ఏ పీడీ హరి హరనాథ్, డీపీవో ఎస్.వి నాగేశ్వర నాయక్, ఎంపీడీవో సుభాషిణి, గ్రామ ప్రత్యేక అధికారి బి. దిలీప్ కుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి సత్తిబాబు, రూరల్ తహశీల్దార్ షరీఫ్, గ్రామ కార్యదర్శి కె.స్టీఫెన్, తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us