రాష్ట్రస్థాయి విజేతను అభినందించిన చైతన్యరాజు

UPDATED 3rd MARCH 2018 SATURDAY 6:00 PM

రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాల విద్యార్థి ఎస్. జానకిరావు రాష్ట్రస్థాయి ఎన్.ఎస్.ఎస్. ఉత్సవాలు-2018లో తృతీయ బహుమతి సాధించిన సందర్భంగా చైతన్య సంస్థల చైర్మన్ కె.వి.వి.సత్యనారాయణరాజు (చైతన్య రాజు) శనివారం అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.వి. సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి ఎన్.ఎస్.ఎస్.యువజనోత్సవాలు గత నెల 26, 27 తేదీలలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో జరిగాయన్నారు. ఈ పోటీలలో తమ కళాశాల విద్యార్థి జానకిరావు మిమిక్రిలో మూడవ స్థానం సాధించాడని, తను  భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని చైర్మన్ చైతన్యరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ పి.వి.జి.కె. జగన్నాధ రాజు, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.వి. సుబ్బారావు, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి.సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.       

ads