అందాల నాగలక్ష్మి

రెడ్ బీ న్యూస్ : సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో వినోదం పంచిచ్చారు కథానాయకుడు నాగార్జున, దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. ఇప్పుడీ చిత్రానికి ప్రీక్వెల్‌గా.. ఈ ఇద్దరి కలయిక నుంచి వస్తున్న సినిమా ‘బంగార్రాజు’. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగచైతన్య మరో హీరో. ఇందులో ఆయనకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చైతన్య గురువారం ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. కృతి ఈ చిత్రంలో నాగలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయిగా సందడి చేయనున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలియజేశారు. ప్రచార చిత్రంలో ఆమె ఎన్నికల్లో గెలిచినట్లుగా మెడలో దండతో.. జనాలకు అభివాదం చేస్తూ క్యూట్‌గా కనిపించింది. ‘‘రొమాన్స్‌, ఎమోషన్స్‌తో పాటు అన్ని రకాల వాణిజ్యాంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం మైసూర్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాలో నాగ్‌ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us