పేదలందరికి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి : ఆర్డీవో వెంకటరమణ

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 9 అక్టోబర్ 2021

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ళ పట్టాలు పొందిన ప్రతీ లబ్ధిదారుడు ఇల్లు నిర్మించుకునే విధంగా లబ్ధిదారులను చైతన్యపరిచి ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆర్డీవో పి.వెంకటరమణ గృహానిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. పెద్దాపురం పట్టణ పరిధిలో సూరంపాలెం రహదారిలో ఉన్న లేఅవుట్ లో నిర్మిస్తున్న గృహాలను ఆయన శుక్రవారం పరిశీలించారు.

ఇళ్ళ నిర్మాణం వేగవంతం చేయడానికి లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించి సత్వరమే ఇల్లు నిర్మించుకునే విధంగా హౌసింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసరా పథకం ద్వారా పొదుపు సంఘాలకు వస్తున్న సొమ్మును ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించుకునే విధంగా లబ్ధిదారులకు తెలియజేయాలని మెప్మా సిబ్బందికి సూచించారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఏడితో ఫోన్ లో మాట్లాడారు. లబ్ధిదారులు అందరినీ సమన్వయ పరుచుకుని హౌసింగ్ అధికారులు నిర్మాణాన్ని పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి. సురేంద్ర, హౌసింగ్ డీఈ ఆర్.ఎస్.కే రాజు, హౌసింగ్ ఏఈ ఈసిహెచ్ సుబ్రహ్మణ్యేశ్వర రావు, మున్సిపల్ టీపీవో ఉమామహేశ్వరరావు, మెప్మా సివోలు ప్రసాద్, రాజ్ కుమార్, సిఎంఎం. వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us