సామర్లకోటలో వనం-మనం

UPDATED 20th SEPTEMBER 2018 THURSDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారుల వెంబడి వనం-మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు గురువారం నిర్వహించారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ ఇటీవల నాటిన మొక్కలను రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులు ఆ మొక్కలను పాడుచేయడం వల్ల ఆ మొక్కలు చుట్టూ ట్రీ గార్డులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రోడ్లపై పశువులు సంచారం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న పశువులను గోరక్షణ సమితికి చేర్చడం జరుగుతుందని, పశువులను వాటి యజమానులు ఇండ్ల పరిసరాల్లో కట్టుకోవాలని లేనియెడల చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇనస్పెక్టర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. 

 

ads