ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి

UPDATED 24th JUNE 2019 MONDAY 7:00 PM

కాకినాడ: ప్రజావాణిలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. స్థానిక కలక్టరేట్ వివేకానంద సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 268 మంది అర్జీదారులు హాజరై జాయింట్ కలెక్టర్, డిఆర్ఓలకు తమ అర్జీలు, ఫిర్యాదులు అందచేశారు. ఈ సందర్భంగా జేసీ డాక్టర్ మల్లిఖార్జున మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలని, ఈ అర్జీలను ఆన్ లైనులో నమోదు చేసి సంబంధిత శాఖల అధికారులకు అందచేశారు. వీటిని వచ్చే సోమవారం నాటికి పరిష్కరించి నివేదిక అందజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కొయ్యలగూడెం మండలం కన్నాపురంకు చెందిన చుక్కావెంకటేశ్వరరావు స్పెషల్ డిప్యూటీ కలక్టరుగా పని చేస్తూ సాధారణ ఎన్నికల విధులు నిర్వహించేందుకు మండపేట రిటర్నింగ్ అధికారిగా ఎన్నికల విధులు నిర్వహిస్తూ మేనెల 28వ తేదీన గుండెపోటుతో మరణించారని, తన పెద్ద కుమార్తెకు కారుణ్య నియామకంలో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఆయన భార్య సూర్యావతి అర్జీని జెసికి అందజేయగా వెంటనే చర్యలు చేపట్టాలని డిఆర్ఓను ఆదేశించారు.
సోమర్లకోట మెహర్ కాంప్లెక్స్ సమీపంలో నివసిస్తున్న అమర్త చిన్న తన కుమార్తె లక్ష్మి లివర్ పెరిగి అనారోగ్యంతో బాధపడుతుందని, ఆపరేషనుకు రూ. 25 లక్షలు ఖర్చు అవుతుందని అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ అర్జీని అందజేయగా, సిఎమ్ సహాయనిధికి సిఫారసు చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. అలాగే ఆపరేషను అవసరమైన చర్యలు చేపట్టాలని ఆరోగ్యశ్రీ కోఆర్డినేటరును జేసీ ఆదేశించారు.
కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో శిక్షణ పొందుతున్న వైద్య విద్యార్థులు జీవన్ రెడ్డి, కెవి ప్రవీణ్ చంద్ ట్రైనింగులో అవసరమైన ఎక్విప్ మెంట్ సమకూర్చటంలేదని, సీనియర్లకు ఉన్న సౌకర్యాలు వారికి కల్పించటం లేదని జెసికి ఫిర్యాదు చేయగా కళాశాల ప్రిన్సిపాల్ ను విచారణ జరిపి నివేదిక అందజేయాలని జెసి ఆదేశించారు. 
ఈ కార్యక్రమంలో బిసి కార్పోరేషన్ ఇడి ఎస్.వి.ఎస్. సుబ్బలక్ష్మి, డిపివో వెంకటరమణ, డిఆర్డిఏ  పిడి మధుసూధనరావు, మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ కె. రమేష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us