స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ ఆసరా పథకం ఒక వరం

* వైఎస్ఆర్ సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు

UPDATED 11th SEPTEMBER 2020 FRIDAY 7:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): స్వయం సహాయక సంఘాలకు వైఎస్సార్ ఆసరా పథకం ఒక వరమని, తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంపిడివో అబ్బిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ ఆసరా పథకం కార్యక్రమంలో దవులూరి దొరబాబు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నవరత్నాల రూపంలో ముందుగానే తేదీలు నిర్ణయించి పధకాలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, అందులో భాగంగానే వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించారని తెలిపారు. ఈ పథకం ద్వారా పెద్దాపురం నియోజక వర్గంలో అర్బన్, రూరల్ ప్రాంతాలకు చెందిన స్వయం సహాయక సంఘాలు 4609 గ్రూపులకు రూ.36 కోట్ల 38 లక్షల 74 వేలు తొలి విడతగా సహాయక సంఘాలకు లబ్ది చేకూరుతుందని, ఈ సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా అర్హత గల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు పారదర్శకతతో అందజేయాలని ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, మరొకవైపు కరోనా కష్టాలు వెంటాడుతున్న ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రభుత్వ ఉద్యోగులు అమలు చేయడంలో స్ఫూర్తినిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు వైఎస్సార్ ఆసరా పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి సందేశాన్ని ఎంపిడివో రమణారెడ్డి చదివి వినిపించారు. అలాగే ఈ పథకం ద్వారా లబ్ది చేకూరి ప్రయోజనం పొందుతున్న మహిళా సంఘ సభ్యులతో ముఖాముఖి స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు, పెద్దాపురం, సామర్లకోట మున్సిపల్ కమీషనర్లు గుంటూరు శేఖర్, ఎం. ఏసుబాబు, సామర్లకోట ఏపీఎం జగదీశ్వరి, పెద్దాపురం తహశీల్దార్ బూసి శ్రీదేవి, ఎస్ఐ ఏ. బాలాజీ, శానిటేషన్ ఇనస్పెక్టర్ డేవిడ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

ads