భక్తిశ్రద్ధలతో కాత్యాయని వ్రతం

UPDATED 2nd FEBRUARY 2018 FRIDAY 6:30 PM

పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కాత్యాయని వ్రతం నిర్వహించారు. సుందరకాండ పారాయణ, ప్రవచనాలలో భాగంగా కాకినాడకు చెందిన భళ్ళమూడి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మంది కన్యలచే స్థానిక నువ్వులగుంట వీధి లక్కీ హైట్స్ లో శుక్రవారం ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యశర్మ వ్రతం విశిష్టతను గురించి మాట్లాడుతూ కాత్యాయని వ్రతం ఆచరించడం వల్ల అనుకూలవంతుడైన భర్త లభించడంతో పాటు సత్ సంతానం కలుగుతుందని, కుజదోష నివారణ జరుగుతుందన్నారు. జనవరి నెల 27 నుంచి ఈ నెల రెండు వరకు స్థానిక శ్రీనివాస భక్త మండలి ఆధ్వర్యంలో హనుమత్ ఉపాసకులు డాక్టర్ పి. శ్రీనివాస్ చే  కీ.శే. ఎం.ఎస్. రామారావు రచించిన సుందరకాండ పారాయణ, ప్రవచనాలు నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీనివాస భక్త మండలి అధ్యక్షుడు రామ సత్యనారాయణ మాట్లాడుతూ శనివారం సీతారాముల కళ్యాణం, ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.           

ads