చెరువులో పడి యువకుడి మృతి

పెద్దాపురం, 15 డిసెంబరు 2020 (రెడ్ బీ న్యూస్): చెరువులో జారి పడి ఒక యువకుడు మృతి చెందాడు. బంగారమ్మ గుడివీధికి చెందిన శ్రీముసిరి లోవరాజు (30) మద్యం మత్తులో బహిర్భూమికి వెళ్లి సీతారాముడు చెరువులో కాలుజారి పడిపోయాడు. నాలుగు రోజులుగా తన కుమారుడు కనిపించడం లేదని తల్లి నాగమణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. చెరువులో మృతదేహం ఉన్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకుని చనిపోయింది లోవరాజేనని గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలాజీ తెలిపారు.
ads