బొండాలు విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు

* కాకినాడ ఎడిఏ జి.వి పద్మశ్రీ 

UPDATED 6th DECEMBER 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): నష్టాన్ని కలిగించే బొండాలు రకం వరి విత్తనాలు డీలర్లు రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కాకినాడ వ్యవసాయశాఖ ఏడీఏ జి.వి. పద్మశ్రీ పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధనా క్షేత్రంలో కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో గల కాకినాడ రూరల్, సామర్లకోట, పెదపూడి మండలాలకు చెందిన  విత్తన, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎడిఎ పద్మశ్రీ మాట్లాడుతూ ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు రైతులకు విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంటీయూ 1121 రకం వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. పోస్ మిషన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు చేపట్టాలని, అలాగే కాలం చెల్లిన మందులను నిల్వ ఉంచరాదని, ఎరువుల నాణ్యతా ప్రమాణాలు తగ్గకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కాకినాడ ఎంఏఓ సురేష్ కుమార్, పెదపూడి ఎంఏఓ సిహెచ్ సత్యనారాయణ, సామర్లకోట ఎంఏఓ ఐ. సత్య, ఏఈవో ఎం.వి. సతీష్, తదితరులు పాల్గొన్నారు.
 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us