రాష్ట్ర బంద్‌ విజయవంతానికి పిలుపు

UPDATED 23rd JULY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న చేపట్టే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ వైసిపి నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని దగా చేశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని, నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి ఉదాసీనతే ఇందుకు కారణమన్నారు. హోదా విషయంలో ప్రజలను పక్కదారి పట్టించారన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వైఖరికి వ్యతిరేకంగా మంగళవారం రాష్ట్ర బంద్‌ను చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అనంతబాబు, మోహన్, ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీ నారాయణ, మద్దాల శ్రీను, సేపేని సురేష్, కానుబోయిన విజయకృష్ణ, గంప శివ, తదితరులు పాల్గొన్నారు.

ads