లాఠీఛార్జీలతో ఉద్యమాన్ని ఆపలేరు

UPDATED 4th JANUARY 2019 FRIDAY 9:00 PM

సామర్లకోట: లాఠీఛార్జీలు, నిర్బంధాలతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆపలేరని సిపిఎం పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టిన వారిపై లాఠీచార్జీ చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మెహర్ కాంప్లెక్స్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శుక్రవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని  హామీ ఇచ్చి, దీన్ని ప్రశ్నించడాన్ని సహించలేక లాఠీచార్జీలు చేయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాలం శ్రీనివాస్, కరణం గోవిందరాజు, చల్లా మహేష్, కరణం శ్రీనివాస్, పవన్ గోపాల్ మిల్కీ, బాలం సత్తిబాబు, కోన శ్రీను, అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads