క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయం

UPDATED 2nd DECEMBER 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి అనుసరణీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అన్నారు. సామర్లకోట పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉజ్జీవ మహాసభలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దవులూరి దొరబాబు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ దయాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన జార్జి థామస్, బత్తిన జోసెఫ్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. క్రిస్టమస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవులు కొవ్వొత్తులను వెలిగించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల పాస్టర్ల సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. మండల పాస్టర్ల సంఘ అధ్యక్షుడిగా జాన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సత్యానందం, అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. 

ads