ప్రగతిలో రోటరీ క్లబ్ ఆఫ్ ప్రగతి ప్రారంభోత్సవ వేడుకలు

UPDATED 10th JULY 2018 TUESDAY 7:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో 2018-19 సంవత్సరం రోటరీ క్లబ్ ఆఫ్ ప్రగతి ప్రారంభోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎమ్. సతీష్ ముఖ్య అతిథిగా, విశిష్ట అతిథిగా వీరభద్రారెడ్డి ఆర్ఎసి హాజరయ్యారు. కార్యక్రమం విద్యార్థుల ప్రార్ధనా గీతంతో ప్రారంభమైన అనంతరం క్లబ్ నిర్వాహకులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రెసిడెంట్  సతీష్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ ప్రగతిని తమ కళాశాలలో 2015లో నెలకొల్పామని, నాటి నుంచి కళాశాల విద్యార్థులు క్లబ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. భావి భారత ఇంజనీర్లలో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్ మాట్లాడుతూ నేటి తరానికి అవసరమైన సామాజిక అవసరాలను తీర్చగలిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిసర ప్రాంత ప్రజలకు వివిధ అంశాలపట్ల అవగాహనా కార్యకలాపాలు  రూపొందిస్తూ ఈ క్లబ్ కార్యక్రమాలు కొనసాగించాలని అన్నారు. విశిష్ట అతిథి వీరభద్రారెడ్డి మాట్లాడుతూ ఈ క్లబ్ కార్యకలాపాల నిర్వహణలో విద్యార్థులకు సూచనలు అందజేసే బాధ్యత తనపై ఉందని, సాంకేతిక, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకునే విధంగా కార్యక్రమాలను తీర్చిదిద్ది వారు రాష్ట్ర, అంతర్జాతీయస్థాయిలో పాల్గొనే విధంగా కార్యక్రమాలను రూపకల్పన చేస్తామని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షులు జి. మోహన చంద్ర మాట్లాడుతూ 2018-19 సంవత్సరానికి మూడవ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి సి.హెచ్. సాయి నరశింహవర్మ క్లబ్ ప్రెసిడెంటుగా, సెక్రెటరీగా ఎస్. రిత్విక్ కృష్ణ ఎంపికైనట్లు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో క్లబ్ డిఆర్ఆర్ లేఖ వేగి నూతనంగా ఎంపికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఫ్యాకల్టీ కో ఆర్డినేటరుగా మాసన్ కుమార్ తమ సహాయ సహకారాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం. వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, జిల్లా మాజీ రోటరాక్ట్ రిప్రజెంటేటివ్ మూర్తి, జిల్లా రోటరాక్ట్ రిప్రజెంటేటివ్స్, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ads