మానసిక స్థైర్యంతో ఒత్తిడులు అధిగమించాలి

UPDATED 10th OCTOBER 2018 WEDNESDAY 7:00 PM

సామర్లకోట: అనారోగ్యాలకు కారణమవుతున్న మానసిక ఒత్తిడులను అధిగమించేందుకు మనోస్థైర్యంతో ఉండాలని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం పురస్కరించుకొని స్థానిక సిరి మానసిక వికలాంగుల పాఠశాలను ఆయన బుధవారం సందర్శించి విద్యార్థులకు స్వీట్లు, పండ్లు, పేస్టులు, తదితర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసిక స్థైర్యంతో ఒత్తిడులు అధిగమించాలని, నిరంతరం యోగా, వ్యాయామంతో ఒత్తిడులకు దూరంగా ఉండవచ్చని అన్నారు. అనంతరం పాఠశాల నిర్వాహకురాలు డి. గోపిదేవి నుంచి పాఠశాల నిర్వహణకు తీసుకొంటున్న చర్యలపై ఆరాతీశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుకురు దుర్గారావు, రాగాల కామేశ్వరరావు, అత్తిలి ప్రభుజీ, మీనాక్షి, పారాలీగల్ వలంటీర్లు భళ్లమూడి సత్యనారాయణమూర్తి, జిల్లా మానవహక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ఎం. భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. 

ads