గృహనిర్మాణాల ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ సమీక్ష

UPDATED 12th NOVEMBER 2019 TUESDAY 6:30 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో చేపట్టనున్న గృహనిర్మాణాలకు సంబంధించిన జాబితాలను సిద్ధం చేసి వాటి  నిర్మాణాలకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. టిడ్కో, మున్సిపల్ కమీషనర్లతో జేసీ తన కార్యాలయపు సమావేశ మందిరంలో గృహ నిర్మాణాలపై సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ గృహనిర్మాణం జరగాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇళ్ళ పట్టాల కార్యక్రమంలో 30శాతం మన జిల్లాలోనే చేపట్టడం జరుగుతుందని, వీటిని దృష్టిలో ఉంచుకుని అర్హులు, అనర్హులకు సంబంధించిన వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా సిద్ధం చేసి జాబితాలను వార్డు, గ్రామ సభల్లో ప్రదర్శించాలన్నారు. సిద్ధమైన జాబితాలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకుర్లతో చర్చించి ఋణాలు మంజూరయ్యే విధంగా కమీషనర్లు చొరవ చూపాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ మున్సిపల్ కమీషనర్ కె. రమేష్, జిల్లాలోని వివిధ మున్సిపల్ కమీషనర్లు, టిడ్కో  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us