మహిళా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే ధనలక్ష్మి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 13 అక్టోబర్ 2021: వైయస్సార్ ఆసరా పథకం కింద రంపచోడవరం నియోజకవర్గం పరిధిలో 11 మండలాల్లో రూ.80 కోట్ల మేర డ్వాక్రా రుణాలను నాలుగు దఫాలుగా మాఫీ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. రెండో విడత వైయస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా బుధవారం పాల్గొన్నారు. వెలుగు ఏపీఎం జేమ్స్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రూ. కోటి నాలుగు లక్షలు విలువైన చెక్కులను ఆమె చేతులమీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగే విధంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు సాగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. మహిళలు పొదుపు పాటించాలని పొదుపు ద్వారా ప్రతి కుటుంబం ఆర్థిక పరిపుష్టి సాధిస్తుందన్నారు. గంగవరం మండలంలో 331 సంఘాలకు రూ. నాలుగు కోట్ల మేర డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం జరుగుతుందన్నారు. తొలి విడత రూ.14 లక్షలు, రెండో విడత రూ. నాలుగు లక్షలు డ్వాక్రా రుణాలు వైయస్సార్ ఆసరా కింద మాఫీ చేయడం జరుగుతుందన్నారు. జగనన్న ప్రభుత్వం అక్కచెల్లెళ్ళ సంక్షేమ ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఏజెన్సీలో ఎన్నికల సమయంలో తాము పర్యటించిన సమయంలో ఆయా గ్రామాలకు చెందిన మహిళలు ముఖ్యంగా తాగునీటి సమస్యపై తన దృష్టికి తీసుకు వచ్చారని, వేసవి వస్తే చాలు మంచినీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పడంతో ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చా మన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు, వెలుగు సిబ్బంది పాలాభిషేకం నిర్వహించారు. తహశీల్దార్ శ్రీమన్నారాయణ, ఎంపీడీవో జాన్ మిల్టన్, ఏపీడీ శ్రీనివాస్, డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ, ఎంపీపీ కృష్ణారెడ్డి, జెడ్.పి.టి.సి సభ్యురాలు బేబీ రత్నం, వైస్ ఎంపీపీ రామ తులసి, కో ఆప్షన్ సభ్యుడు ప్రభాకర్, గంగవరం ఎంపీటీసీ సభ్యురాలు గంగాదేవి, ఉపసర్పంచ్ వెంకటేశ్వరరావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ వై.వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు పద్మావతి, కనకలక్ష్మి, వెంకట్ లక్ష్మి, మండల కన్వీనర్ అప్పలరాజు, మండల ఇంచార్జ్ రఘునాథ్. వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, వెలుగు సీసీలు, ఎమ్మెస్ లీడర్ తదితరులు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us